అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చలో 11 పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. 10 పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. వైసీపీ మాత్రం బిల్లును వ్యతిరేకించింది
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఇరుసభల ఆమోదం లభించింది. నిన్న లోక్‌సభ ఆమోదం తెలిపిన ఈ బిల్లుకు, ఇవాళ రాజ్యసభ కూడా మూజువాణి ఓటుతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బిల్లు ఇరుసభల నుంచి ఆమోదం పొందింది.
ఇక ఈ బిల్లు చట్టంగా మారేందుకు భారత రాష్ట్రపతి ఆమోదం మాత్రమే మిగిలి ఉంది.
అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకించారు. ప్రత్యేక హోదాపై స్పష్టత లేదని పేర్కొంటూ రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఇదే అంశంపై లోక్‌సభలో కూడా వైసీపీ ఎంపీలు వాకౌట్ చేశారు.
ఈ బిల్లుపై చర్చలో 11 పార్టీల ఎంపీలు పాల్గొనగా, 10 పార్టీలు మద్దతు తెలిపాయి. ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకించింది.