మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని పై కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
మచిలీపట్నంలోని కొబ్బరి తోటలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేసిన నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది. ఈ ఘటనపై స్పందించిన పేర్ని నాని పోలీసులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా పరమేశ్వరరావు పై బాడీ షేమింగ్ చేస్తూ అవమానకరంగా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, “మా ప్రభుత్వం వస్తే చూస్తాం” అంటూ పోలీసులను బెదిరించినట్లు సమాచారం.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రజా ప్రతినిధి ఒకరు పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనతో రాజకీయంగా మరింత ఉద్రిక్తత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.