ఒక ముఖ్య విషయం ఏమిటంటే, ఇప్పుడు యుద్ధాలు కేవలం బాంబులు, గన్స్‌తోనే జరగడం లేదు. సైబర్ దాడులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. హ్యాకర్లు ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఇమెయిల్స్, రహస్య సమాచారాన్ని టార్గెట్ చేస్తున్నారు

అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28న ఇరాన్‌పై భారీ స్థాయిలో సమన్వయ వైమానిక దాడులు ప్రారంభించిన వెంటనే, పరిస్థితులు వేగంగా మారాయి. మార్చి 1 ఉదయం ముందురోజే, ఇరాన్‌కు చెందిన షాహెద్ డ్రోన్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్లలో రెండు కేంద్రాలపై దాడులు జరిపాయి.

ఇదే సమయంలో బహ్రెయిన్‌లో ఉన్న మరో కమర్షియల్ డేటా సెంటర్ కూడా దాడికి గురైంది. అయితే అది ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు.

యుద్ధం ప్రారంభమై ఒక నెల గడిచిన తరువాత కూడా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇరాన్ గురువారం రోజు దుబాయ్‌లో ఉన్న Oracle కంపెనీ డేటా సెంటర్‌పై దాడి చేశామని ప్రకటించింది. అయితే ఈ ఆరోపణలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం ఖండించింది.

ఇరాన్ ప్రభుత్వ మీడియా తమ ప్రకటనలో, అమెరికాకు చెందిన టెక్ కంపెనీలను టార్గెట్ చేయడం కొనసాగిస్తామని స్పష్టం చేసింది.:ఏప్రిల్ నెలలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రతి రోజూ డేటా సెంటర్లపై దాడులు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏప్రిల్ 1న బహ్రెయిన్‌లోని ఒక అమెజాన్ డేటా సెంటర్‌పై మరో ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. అలాగే ఏప్రిల్ 2న దుబాయ్‌లోని Oracle డేటా సెంటర్‌పై కూడా దాడి జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది.

ఈ వరుస దాడులు ప్రపంచానికి ఒక స్పష్టమైన సంకేతం ఇస్తున్నాయి – ఇక యుద్ధాలు కేవలం భౌతిక స్థాయిలోనే కాకుండా డిజిటల్ మౌలిక సదుపాయాలపై కూడా జరుగుతున్నాయి
డేటా సెంటర్లు ఇప్పుడు కీలకమైన యుద్ధ లక్ష్యాలుగా మారుతున్నాయి టెక్నాలజీ కంపెనీలు కూడా యుద్ధ ప్రభావానికి లోనవుతున్నాయి

సారాంశంగా: