పవన్ కళ్యాణ్ గారికి సత్ర చికిత్స... 7 నుండి పది రోజులు విశ్రాంతి...

ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షులు అయిన పవన్ కళ్యాణ్ గారికి శనివారం సాయంత్రం విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.
శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన అంశాలపై చర్చిస్తున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో, వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు ఆ రోజు అధికారిక కార్యక్రమాలను రద్దు చేసి ఆసుపత్రికి చేరుకున్నారు.
అక్కడ వైద్యులు పూర్తి పరీక్షలు నిర్వహించగా, అందులో భాగంగా ఎం.ఆర్.ఐ. స్కాన్ కూడా చేశారు. నివేదికలను పరిశీలించిన తర్వాత శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించి, వెంటనే శస్త్రచికిత్స నిర్వహించారు.
డాక్టర్ల ప్రకారం:
ఆయన ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉంది
సుమారు 7 నుంచి 10 రోజులపాటు విశ్రాంతి అవసరం
ఆ తర్వాత మళ్లీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు
పూర్తిగా కోలుకోవడానికి కొంతకాలం జాగ్రత్తలు అవసరం
ఈ సమాచారం అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ వెల్లడించారు