ప్రత్యేక రైతు బజార్లు, విక్రయ కేంద్రాల ద్వారా సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం అందుబాటులోకి.. రైస్ మిల్లర్లతో ప్రభుత్వం సమీక్ష

రాష్ట్రంలో బియ్యం ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి, బియ్యం ధరల నియంత్రణపై విస్తృతంగా చర్చించింది.

ఈ సమావేశంలో ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక రైతు బజార్లు, ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఇలా ఉన్నాయి:

BPT & KNM స్టీమ్ రైస్ – కిలో ₹52
రా రైస్ (పచ్చి బియ్యం) – కిలో ₹50

ఈ కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజలపై పెరుగుతున్న బియ్యం ధరల భారం తగ్గడంతో పాటు, నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిర్ణయానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరలకు బియ్యం విక్రయం ప్రారంభం కానుంది.