మార్గమధ్యంలో మంగళగిరి వద్ద స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కుంకీలకు స్వయంగా ఆహారం అందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు జెండా ఊపి గుచ్చిమి క్యాంపుకు సాగనంపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు సంఘర్షణల నివారణ చర్యలను బలోపేతం చేసే దిశగా పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద స్వాగతం పలికారు.

గజరాజులకు మార్గమధ్యంలో పూలు చల్లి స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రివర్యులు, వాటికి స్వయంగా ఆహారం అందజేశారు. అనంతరం గుచ్చిమి శిబిరానికి బయలుదేరిన కుంకీల రెండో అంచె ప్రయాణాన్ని జెండా ఊపి సాగనంపారు.


ఈ సందర్భంగా ప్రయాణంలో కుంకీల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. గుచ్చిమి క్యాంపునకు చేరిన అనంతరం నిపుణుల పర్యవేక్షణలో అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేందుకు అవసరమైన చర్యలు