ఇది అత్యంత తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమని అన్నారు.

న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, నిరసనకారులపై పోలీసులు దాడి చేయడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనకారులను యువ ఐపీఎస్‌ అధికారులు స్వయంగా వెళ్లి కొట్టడం చాలా బాధాకరంగా ఉందన్నారు.

“యువ ఐపీఎస్‌ అధికారులు స్వయంగా వెళ్లి నిరసనకారులు, ఆందోళనకారులపై దాడి చేయడం చూసినప్పుడు మనందరం కలత చెందుతాం. ఇది గమనించడానికి చాలా, చాలా బాధాకరమైన విషయం” అని ఆయన వ్యాఖ్యానించారు.

పోలీసు అధికారులు విధులు నిర్వహించేటప్పుడు పాటించాల్సిన నిష్పక్షపాత ధోరణి, సంయమనం క్రమంగా కనుమరుగవుతున్నట్లు కనిపిస్తోందని జస్టిస్‌ భుయాన్‌ పేర్కొన్నారు. ఇది అత్యంత తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమని అన్నారు.

NEET పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై జరిగిన నిరసనల సందర్భంగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీలో, ఆందోళనకారులు-భద్రతా సిబ్బంది మధ్య పలు ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.