ఆయా ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా మండపాలను ఏర్పాటు చేసి గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇళ్లలోనూ చిన్న గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.

వినాయక చవితి సందర్భంగా పూజా సామగ్రి, పూలు, పండ్లు తదితరాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు మార్కెట్లకు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ప్రధాన మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరగడంతో ఈసారి పలుచోట్ల ప్రజలు మట్టి వినాయక విగ్రహాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

మరోవైపు వినాయక చవితి సందర్భంగా భక్తులు ఆలయాలకు తరలివెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో పలు ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.