ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేతపవన్ కళ్యాణ్ పై తెలంగాణలో కొందరు జర్నలిస్టులు, రాజకీయ నేతలు వరుసగా విమర్శలు చేయడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలను వక్రీకరిస్తూ తెలంగాణలో ప్రత్యేక సమావేశాలు పెట్టి తీవ్ర విమర్శలు చేయడం జనసేన కార్యకర్తల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది.
“తెలంగాణకు పవన్ కళ్యాణ్‌కు సంబంధం ఏమిటి?” అని ప్రశ్నిస్తున్నవారికి జనసేన వర్గాలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కేవలం సినీ నటుడు మాత్రమే కాదు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నాయకుడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం రాజకీయ సంస్కృతికే మచ్చ అంటున్నారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కొన్ని రాజకీయ నేతలు ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ తీవ్ర స్థాయిలో స్పందించారు.
జనసేన అభిమానులు మాత్రం మరో ప్రశ్న లేవనెత్తుతున్నారు.
“ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంపై పబ్లిక్‌గా అవమానకర వ్యాఖ్యలు చేస్తే మీడియా సంస్థలు, పోలీసు శాఖ ఎందుకు స్పందించడం లేదు? అదే ఇతర నేతల విషయంలో అయితే వెంటనే కేసులు పెట్టేవారు కాదా?” అని ప్రశ్నిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాలేదని, గతంలో తెలంగాణ ఎన్నికల్లో కూడా ప్రచారం చేసిన నాయకుడని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో #WeSupportPawanKalyan, #JanaSena, #RespectDeputyCM వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. జనసేన శ్రేణులు మాత్రం “వ్యక్తిగత దూషణలు కాదు.. ప్రజా సమస్యలపై చర్చించండి” అంటూ హెచ్చరిస్తున్నాయి.