ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ వరుసగా రెండో ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి Pawan Kalyan హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డుల సాధనలో కీలక పాత్ర పోషించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది, సర్పంచులు, వార్డు సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
న్యూఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రం తరఫున అవార్డులు స్వీకరించిన ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణ తేజలకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పురస్కారాలు గ్రామీణ స్థానిక సంస్థల పనితీరు, ప్రజాప్రతినిధుల నిబద్ధత, అధికారుల సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.
అవార్డులు అందించిన స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేసి గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకుంది. మహిళలకు స్నేహపూర్వక పంచాయతీల విభాగంలో Bokkasampalem ప్రథమ స్థానం సాధించగా, సుపరిపాలన విభాగంలో Sringavaram దేశంలో నంబర్-1 ర్యాంకు పొందింది. పేదరిక నిర్మూలన, జీవనోపాధి మెరుగుదల విభాగంలో Chemmellapalli రెండో స్థానం దక్కించుకోగా, స్వయం సమృద్ధి విభాగంలో Gundamala గుర్తింపు పొందింది. అత్యుత్తమ మండలాల విభాగంలో Kuppam మూడో స్థానం సాధించింది.