జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, Pawan Kalyan కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు జనసైనికుల నుంచే భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రత్యేక నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను నియమించారు.

పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పించేందుకు ఈ కమిటీలు పనిచేస్తాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేసే దిశగా కసరత్తు జరుగుతోందన్నారు.

కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే జనసేన లక్ష్యమని పేర్కొన్న ఆయన, క్షేత్రస్థాయి సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించిన అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

"జనసైనికులే జనసేన భవిష్యత్తు నాయకులు.. కేడర్‌కు ప్రాధాన్యతే పార్టీ బలం" అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.