ఆంధ్రప్రదేశ్‌లో గురువారం వాతావరణం విభిన్నంగా ఉండనుంది. ఒకవైపు తీవ్ర ఎండలు, మరోవైపు ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ద్రోణి ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 46 మండలాల్లో భారీ ఉరుములు, 79 మండలాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
అదే సమయంలో ఏలూరు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 43-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వర్షాలు, పిడుగులు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల వద్ద నిలవొద్దని హెచ్చరించారు.