Janasena singam
Breaking
రామ్ చరణ్ పెద్ది వాయిదా రాజమండ్రిలో కలకలం స్కూల్ వైపు వెళ్లిన పెద్దపులి.. పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. జనసేన లీడర్లకు పవన్ ఫుల్ క్లాస్ ఏపీలో మద్యం అధిక ధరల విక్రయాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన రెండు తెలుగు రాష్ట్రాల్లో పులుల కలకలం.. భయం గుప్పిట్లో జనం 77వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకలు జయప్రదం చెయ్యండి దావోస్ WEF 2026లో ఏపీ సత్తా… రూ.90 వేల కోట్ల పెట్టుబడులతో లోకేశ్ హైలైట్ ట్రంప్ – ఒక్క పోస్ట్‌తో అమెరికా రాజకీయాల్లో కలకలం రేపు కొండగట్టు క్షేత్రానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ జగన్ హయాంలో అమరావతిని పట్టించుకోలేదు..మంత్రి నారాయణ వాతావరణ మార్పులు & సౌదీ అరేబియా ఎడారిలో మంచు వర్షం
Logo
Janasena singam
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026 సదస్సులో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ కీలక ఆకర్షణగా నిలిచారు. నాలుగు రోజుల పర్యటనలో ప్రపంచ దిగ్గజ కంపెనీలతో చర్చలు జరిపి రూ.90 వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చారు. దీని ద్వారా ఐటీ, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు రానున్నట్లు సమాచారం.
స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2026 సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ నెల 19 నుంచి 23 వరకు ఐదు రోజులపాటు జరిగిన ఈ ప్రపంచ ఆర్థిక సదస్సు “స్పిరిట్ ఆఫ్ డైలాగ్” అనే థీమ్‌తో సాగింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్స్కీ సహా దాదాపు 400 మంది రాజకీయ నాయకులు, 850 మంది కార్పొరేట్ సీఈఓలు పాల్గొన్నారు. భారత్ తరఫున కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందాలు దావోస్‌కు వెళ్లాయి. సదస్సు ముగిసేలోగా సీఎం చంద్రబాబు నాయుడు స్వదేశానికి తిరిగి రాగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ మీదుగా అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఇక ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ నాలుగు రోజుల దావోస్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని శనివారం సాయంత్రం భారత్‌కు తిరిగిరానున్నారు. “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” నినాదంతో పెట్టుబడుల ఆకర్షణలో దూసుకెళ్తున్న మంత్రి నారా లోకేశ్ ఈసారి దావోస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతేడాది సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిన లోకేశ్, గూగుల్, యాక్సెంచర్ వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు. కాగ్నిజెంట్ కార్యాలయాన్ని విశాఖపట్నంలో 11 నెలల్లోనే ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది లోకేశ్ ఎలాంటి ఫలితాలు సాధిస్తారన్న ఆసక్తి నెలకొంది. నాలుగు రోజుల పర్యటనలో ఆయన సుమారు 45 కీలక సమావేశాల్లో పాల్గొనగా, 25 వన్-టు-వన్ భేటీలు నిర్వహించారు. అలాగే ఎనిమిది రౌండ్ టేబుల్ సమావేశాలు, ఐదు అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. గూగుల్ క్లౌడ్, ఐబీఎం, బ్లాక్‌స్టోన్, బ్రూక్‌ఫీల్డ్, వెస్టాస్, జీరా, ఆర్ఎఫ్ఎస్జీ గ్రూప్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల సీఈఓలతో నేరుగా చర్చలు జరిపారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని వివరించడంతో పాటు వేగవంతమైన అనుమతుల విధానాన్ని వివరించారు. ఈ పర్యటన ఫలితంగా దాదాపు రూ.90 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని సమాచారం. దీని ద్వారా సుమారు లక్ష ఉద్యోగాలు కలగనున్నాయని అంచనా. ముఖ్యంగా RMZ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం అత్యంత కీలకంగా మారిందని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా ఐటీ, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. విశాఖపట్నంలో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్క్ (GCC), రాయలసీమలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే వెస్టాస్ సంస్థ విండ్ టర్బైన్ తయారీ యూనిట్‌పై, జీరా సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.