దివాన్ చెరువు సెంటర్ సమీపంలో పెద్దపులి సంచరిస్తూ కనిపించింది
కొద్ది రోజులుగా Rajahmundry పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. తాజాగా దివాన్ చెరువు సెంటర్ సమీపంలో పెద్దపులి సంచరిస్తూ కనిపించడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్‌వీపీసీ ఫంక్షన్ హాల్ దగ్గర కూడా జనాలకు దర్శనమిచ్చినట్లు సమాచారం. అక్కడి నుంచి పెద్దపులి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్లినట్టుగా తెలుస్తోంది.
ఓ చోట పెద్దపులి తిరుగుతుండగా కారులో ప్రయాణిస్తున్న కొంతమంది యువకులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాడాల దగ్గర పెద్దపులి పాదముద్రలు కనిపించడంతో అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
మొన్నటి వరకు Eluru district ఏజెన్సీ ప్రాంతాన్ని వణికించిన పెద్దపులి ఇప్పుడు **East Godavari district**లోకి ప్రవేశించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఫిబ్రవరి 1న **Rajahmundry Rural**లోని తొర్రేడులో పశువులపై దాడి చేసి చంపిన ఘటన కలకలం రేపింది. పులి దాడిపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మీడియా సమావేశం నిర్వహిస్తుండగానే వారి వెనకే పెద్దపులి కనిపించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఇదే సమయంలో Nellore districtలోని Dattalur mandal పరిధిలోని నందిపాడులోనూ పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం. రేమానుకుంట వద్ద స్థానికులకు కనిపించడంతో Udayagiri పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలో జీవిస్తున్నారు.
అటవీ శాఖ అప్రమత్తమై ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, రాత్రివేళల్లో బయటకు రావద్దని సూచించింది. పరిస్థితిపై నిరంతర నిఘా కొనసాగుతోంది.