ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
పవర్ స్టార్ Pawan Kalyan హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ **Ustaad Bhagat Singh**పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైనమిక్ డైరెక్టర్ Harish Shankar దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో Sreeleela, Raashii Khanna హీరోయిన్లుగా నటిస్తున్నారు.
‘ఓజీ’ వంటి భారీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ చాలా కాలంగా ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.
మార్చ్ 26న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుందని వెల్లడించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.