Janasena singam
Breaking
రామ్ చరణ్ పెద్ది వాయిదా రాజమండ్రిలో కలకలం స్కూల్ వైపు వెళ్లిన పెద్దపులి.. పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. జనసేన లీడర్లకు పవన్ ఫుల్ క్లాస్ ఏపీలో మద్యం అధిక ధరల విక్రయాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన రెండు తెలుగు రాష్ట్రాల్లో పులుల కలకలం.. భయం గుప్పిట్లో జనం 77వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకలు జయప్రదం చెయ్యండి దావోస్ WEF 2026లో ఏపీ సత్తా… రూ.90 వేల కోట్ల పెట్టుబడులతో లోకేశ్ హైలైట్ ట్రంప్ – ఒక్క పోస్ట్‌తో అమెరికా రాజకీయాల్లో కలకలం రేపు కొండగట్టు క్షేత్రానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ జగన్ హయాంలో అమరావతిని పట్టించుకోలేదు..మంత్రి నారాయణ వాతావరణ మార్పులు & సౌదీ అరేబియా ఎడారిలో మంచు వర్షం
Logo
Janasena singam
తిరుమల లడ్డూ వ్యవహారంపై ఇంత జరుగుతున్నా ఒక్కరూ ఎందుకు మాట్లాడరుజనసేన
జనరల్ బాడీ సమావేశంలో నేతలపై పవన్ కల్యాణ్ ఫుల్ సీరియస్
జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ నేతలపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ వివాదంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా, పార్టీ నుంచి ఒక్క నాయకుడు కూడా స్పందించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని ప్రశ్నించారు. “అన్నింటికీ నేనే మాట్లాడాలా? మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, పాలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఎందుకు ఉన్నారు?” అంటూ పవన్ తీవ్రంగా నిలదీశారు. అదే సమయంలో వైసీపీ నేతల వ్యాఖ్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారి ట్రాప్‌లో పడవద్దని హెచ్చరించారు. మీపై, మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని, కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. భావోద్వేగాలతో కాకుండా సిద్ధాంత పరంగా, సబ్జెక్ట్‌పై మాత్రమే మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత వ్యవహారాల్లో జాగ్రత్త అవసరమని, మీ చర్యల వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని పవన్ స్పష్టం చేశారు. “అందరి చిట్టా నా దగ్గర ఉంది” అంటూ నేతలను హెచ్చరించారు. ఆగ్రహంతో సమావేశాన్ని మధ్యలోనే వదిలి వెళ్లిపోయారు. తదుపరి ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై నివేదిక ఇవ్వాలని నాదెండ్ల మనోహర్‌కు ఆదేశించారు.