Janasena singam
Breaking
రామ్ చరణ్ పెద్ది వాయిదా రాజమండ్రిలో కలకలం స్కూల్ వైపు వెళ్లిన పెద్దపులి.. పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. జనసేన లీడర్లకు పవన్ ఫుల్ క్లాస్ ఏపీలో మద్యం అధిక ధరల విక్రయాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన రెండు తెలుగు రాష్ట్రాల్లో పులుల కలకలం.. భయం గుప్పిట్లో జనం 77వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకలు జయప్రదం చెయ్యండి దావోస్ WEF 2026లో ఏపీ సత్తా… రూ.90 వేల కోట్ల పెట్టుబడులతో లోకేశ్ హైలైట్ ట్రంప్ – ఒక్క పోస్ట్‌తో అమెరికా రాజకీయాల్లో కలకలం రేపు కొండగట్టు క్షేత్రానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ జగన్ హయాంలో అమరావతిని పట్టించుకోలేదు..మంత్రి నారాయణ వాతావరణ మార్పులు & సౌదీ అరేబియా ఎడారిలో మంచు వర్షం
Logo
Janasena singam
ఏలూరు జిల్లా ఏజెన్సీని వణికించిన పెద్దపులి ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పులుల సంచారం ఎక్కువైపోయింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చిన పులులు అలజడి సృష్టిస్తున్నాయి. మొన్నటి వరకు ఏలూరు జిల్లా ఏజెన్సీని వణికించిన పెద్దపులి ఇప్పుడు తూర్పు గోదావరిలోకి ప్రవేశించింది.\ నిన్న రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడులో పశువులపై దాడి చేసి చంపేసింది. పులి దాడిపై స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు మీడియా సమావేశం నిర్వహిస్తుండగా.. వారి వెనకాలే పులి కనిపించింది.పులి సంచారం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాజమండ్రి రూరల్, కోరుకుంట్ల, సీతానగరం మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. పిల్లల్ని బయటకు వెళ్లినీయకుండా జాగ్రత్త తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది. ఇక నెల్లూరు జిల్లా దత్తలూరు మం‌డలం నందిపాడులోనూ పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. రేమానుకుంట వద్ద స్థానికులకు పెద్దపులి కనిపించింది. దీంతో ఉదయగిరి పరిసర ప్రాంతాలవారు భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.