Janasena singam
Breaking
రామ్ చరణ్ పెద్ది వాయిదా రాజమండ్రిలో కలకలం స్కూల్ వైపు వెళ్లిన పెద్దపులి.. పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. జనసేన లీడర్లకు పవన్ ఫుల్ క్లాస్ ఏపీలో మద్యం అధిక ధరల విక్రయాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన రెండు తెలుగు రాష్ట్రాల్లో పులుల కలకలం.. భయం గుప్పిట్లో జనం 77వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకలు జయప్రదం చెయ్యండి దావోస్ WEF 2026లో ఏపీ సత్తా… రూ.90 వేల కోట్ల పెట్టుబడులతో లోకేశ్ హైలైట్ ట్రంప్ – ఒక్క పోస్ట్‌తో అమెరికా రాజకీయాల్లో కలకలం రేపు కొండగట్టు క్షేత్రానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ జగన్ హయాంలో అమరావతిని పట్టించుకోలేదు..మంత్రి నారాయణ వాతావరణ మార్పులు & సౌదీ అరేబియా ఎడారిలో మంచు వర్షం
Logo
Janasena singam
ఏపీలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ఆయన స్పందించారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తాయని పేర్కొన్నారు. మద్యం విక్రయాల్లో దుకాణదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు. అలాగే సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా కొనసాగించాలని మార్గనిర్దేశం చేశారు. అధిక ధరలకు మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు.